ఎన్‌టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలపై సమీక్ష

ABN , First Publish Date - 2022-01-18T04:01:27+05:30 IST

ఎన్‌టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమాలపై సోమవారం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో చర్చించారు.

ఎన్‌టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలపై సమీక్ష
నాయకులతో సమీక్షిస్తున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

వెంకటగిరి, జనవరి 17:  ఎన్‌టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం  నిర్వహించనున్న కార్యక్రమాలపై  సోమవారం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో చర్చించారు.  రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు విజయవంతం చేయడంలో నాయకులు, కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీరామదాసు గంగాధర్‌, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్‌ నాయుడు, గల్లా శ్రీనివాసులు, చలపతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T04:01:27+05:30 IST