Cinema News: టికెట్ రేటు, ఓటీటీ అంశాలపై చర్చించాం: C. Kalyan

ABN , First Publish Date - 2022-07-22T01:16:00+05:30 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశమైంది. ఈ సమావేశానికి కౌన్సిల్ మెంబర్లు, నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు. ఈ

Cinema News: టికెట్ రేటు, ఓటీటీ అంశాలపై చర్చించాం: C. Kalyan

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హైదరాబాద్‌లో సమావేశమైంది. కౌన్సిల్ మెంబర్లు, నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలు, ఓటీటీపై చర్చించామన్నారు. చిత్ర నిర్మాణ వ్యయం, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలా? లేక ఉన్నవి మాత్రమే పూర్తి చేయాలా? అనే విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. 23న జరిగే సమావేశంలో ఆల్ సెక్టార్స్ మధ్య  ఫిలిం ఛాంబర్ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని కళ్యాణ్ చెప్పారు. 

Updated Date - 2022-07-22T01:16:00+05:30 IST