హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ జీ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, హుజురాబాద్ ఉపఎన్నిక సహా తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సమావేశంలో బండి సంజయ్, డీకే.అరుణ, విజయశాంతి, లక్ష్మణ్, ఎంపీ సోయం బాబురావు, జితేందర్ రెడ్డి, విజయరామారావు, ఏ.చంద్ర శేఖర్, గరికపాటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.