తెనాలి: తమ చర్చి విషయాల్లో బ్రదర్ అనిల్ కుమార్ జోక్యం చేసుకుంటుండడంతో ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చి సంఘస్తులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంఘంలోకి బయటవ్యక్తులు అక్రమంగా ప్రవేశిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. సంఘంలో బ్రదర్ అనిల్‌కుమార్ ప్రమేయం పెరిగిపోతోందని ఆందోళన చేశారు. సంఘం కోశాధికారిగా లాజరస్ అబ్రహాం నియామకంపై అసంతృప్తిని ప్రకటించారు. సమావేశంలో బ్రదర్ అనిల్‌కు వ్యతిరేకంగా సంఘస్తులు నినాదాలు చేశారు. బ్రదర్ అనిల్ నుంచి సంఘం ఆస్తులను కాపాడుకోవాలని భేటీలో తీర్మానం చేసినట్లు వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి