అధికారులు లేకుండా ఎందుకీ సమావేశం

ABN , First Publish Date - 2022-05-22T05:58:29+05:30 IST

అధికారులు లేకుండా ఎందుకీ సమావేశం

అధికారులు లేకుండా ఎందుకీ సమావేశం
అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు

జంగారెడ్డిగూడెం మండల సమావేశం గరం..గరం.. బాయ్‌కాట్‌ చేసిన సర్పంచ్‌లు
ప్రశ్నల వర్షం కురిపించిన వైసీపీ నాయకులు


జంగారెడ్డిగూడెం మండల సర్వసభ్య సమా వేశం గరంగరంగా సాగింది. వైసీపీ నాయ కులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిల దీశారు.. వైసీపీ నాయకులు వేస్తున్న ప్రశ్నలకు ప్రజా ప్రతినిధులు సైతం మాట్లాడలేని పరిస్థితి.  గమ్మున కుర్చీల్లోనే కూర్చుని ఊకొడుతూ వచ్చారు. చివరకు మూడు శాఖల అధికారులు గైర్హాజరయ్యారని సర్పంచ్‌ లంతా బహిష్కరించారు. దీంతో చాలాసేపు స్టేజ్‌పై అధికారులు, ప్రజా ప్రతినిధులు దిక్కులు చూడగా మిగిలిన అఽధికారులంతా ఊసులు చెప్పుకున్నారు..

జంగారెడ్డిగూడెం, మే 21 : జంగారెడ్డిగూడెం మండల సర్వసభ్య సమావేశంలో శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎపీపీ కొదమ జ్యోతి అధ్యక్షతన జరిగింది. అయితే ముందుగా పలు శాఖల అధికారులు తమ శాఖల సమీక్షను ప్రజాప్రతినిధులకు వివ రించారు. ఉద్యానవనశాఖ సమీక్ష సమయంలో అందరికీ అందుబాటులోకి పామాయిల్‌ మొ క్కలు తేవాలని వైసీపీ నాయకులు హరిబాబు కోరారు. నిమ్మలగూడెం వైసీపీ నాయకుడు తాని గడప రామకృష్ణ, పుట్లగట్లగూడెం  నాయకుడు వామిశెట్టి హరిబాబు, పేరంపేటకి చెందిన ఇర్ల శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ లక్కవరం విద్యుత్‌ సెక్షన్‌ ఏఈ అందుబాటులో ఉండడం లేదని రైతుల దగ్గర ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం సొమ్ములు వసూలు చేస్తున్నారని సమావేశంలో ఆరోపిం చారు. ఏఈని బదిలీ చేయించేయాల న్నారు. అలాగే వేగవరం సర్పంచ్‌ లక్కాబత్తుల నాగ రాజుపై ఫిర్యాదు చేస్తే ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా కనీసం విచారణ జరపకుండా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు వేశారంటూ సర్పంచ్‌ నాగ రాజుతో పాటు అక్కంపేట సర్పంచ్‌ నాగేంద్ర ఏఎస్‌ఐ గంగాధర్‌ను ప్రశ్నించారు. ఏదైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మండ లంలో రెవెన్యూ సమస్యలు కోకొల్లలు ఉంటే కనీసం రెవెన్యూ శాఖ నుంచి ఒకరు కూడా హాజరుకాకపోవడంపై శ్రీనివా సపురం సర్పంచ్‌ యడ్లపల్లి దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా జరుగుతుండగా గంట తరువాత ఆర్‌ఐ సూర్యనారాయణ వచ్చి స్టేజ్‌పై కూర్చోవడంపై యడ్లపల్లి దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన స్టేజీ దిగాలని డిమాండ్‌ చేయడంతో ఆర్‌ఐ స్టేజీ దిగారు. విష యం తెలుసుకున్న ఇన్‌చార్జ్‌ తహిసీల్దార్‌ శేఖర్‌ సమావేశం వద్దకు వచ్చి ఉద్యోగ రీత్యా కోర్టు, జేసీ మీటింగ్‌ల కారణంగా ఆర్‌ఐను పంపానని, ఈ విషయం శుక్రవారం రాత్రే ఎంపీడీవోకు సమా చారం ఇచ్చానని తెలిపారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ అధికారులు గైర్హాజరవ్వడంతో ‘‘పూర్తి స్ధాయి అధికారులు వస్తేనే సమస్యలు పరి ష్కారం అవుతాయి.. చర్చకు ఫలితం ఉంటుంది.. ఇలా కొన్నిశాఖల అధికారులు రాకుండా సమా వేశం ఏమిటంటూ’’ సర్పంచ్‌లు సమావేశాన్ని బహిష్కరించారు. అరగంట తరువాత జడ్పీ టీసీ పోల్నాటి బాబ్జి బాయ్‌కట్‌ చేసిన సర్పంచ్‌ లతో చర్చించారు. మరలా సమావేశ మంది రానికి తీసుకువచ్చారు. అభివృద్ధి, పఽథకాలపై మరోసారి సమీక్ష నిర్వహించేందుకు సర్పంచ్‌లు కోరారని, అయితే ఆరోజు జరిగే సమావేశంలో అన్ని శాఖల అఽధికారులు తప్ప కుండా హాజర య్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు. ఎంపీపీ కొడద జ్యోతి మాట్లా డుతూ ప్రతీ సమావేశంలో అన్ని శాఖల అధికారులు తప్పకుండా పాల్గొనాల న్నారు.  

Updated Date - 2022-05-22T05:58:29+05:30 IST