రైతు సమస్యలు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2022-08-18T06:03:02+05:30 IST

రైతుల సమస్య పరిష్కారమే ధ్యేయమని రాష్ట్ర అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీ.నాగిరెడ్డి అన్నారు.

రైతు సమస్యలు పరిష్కరిస్తాం
అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీ.నాగిరెడ్డి

అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీ.నాగిరెడ్డి 


రాజమహేంద్రవరం సిటీ/రూరల్‌, ఆగస్టు 17 : రైతుల సమస్య పరిష్కారమే ధ్యేయమని రాష్ట్ర అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీ.నాగిరెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీధర్‌ , రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతాంగం సమస్యలను వ్యవసాయ అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు రైతులతో మమేకమై వారి సమస్యలు పరిష్కారం దిఽశగా అడుగులు వేస్తున్నామని ఇప్పటికి జిల్లాలో మూడు సార్లు సలహామండలి బోర్డు సమావేశాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు వుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు గిట్టుబాటుధరలు ఇవ్వడంతో పాటు వారికి సత్వరమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో జిల్లా అగ్రి అడ్వయిజరీ బోర్డు చైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు,అగ్రి మిషన్‌ సభ్యుడు జె రామారావు, అగ్రిమిషన్‌ ఓఎస్‌డీ చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎస్‌.మాధవరావు, జిల్లా మత్య్సశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కృష్ణారావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి సత్యగోవింద్‌, జిల్లా ఆర్టికల్చర్‌ ఆఫీసర్‌ వి.రాధాకృష్ణ పాల్గొన్నారు. 


పదోన్నతి కల్పించాలని వినతి..


రాజమహేంద్రవరంరూరల్‌, ఆగస్టు 17: వ్యవసాయ విస్తరణాధికారులకు సహాయ వ్యవసాయ అధికారులు పదోన్నతి కల్పించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయమై సీఎంతో చర్చించాలని వ్యవసాయ విస్తరణాధికారులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు విస్తరణాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రతినిధి ఎం.నాగేశ్వరరావు, పీటర్‌, సునీల్‌, రఘు, ఎంవీ.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T06:03:02+05:30 IST