నేడు కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ

ABN , First Publish Date - 2021-12-04T07:34:16+05:30 IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షపై చర్చించేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) గాంధీభవన్‌లో శనివారం భేటీ కానుంది.

నేడు కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ

ఢిల్లీలో దీక్ష, సభ్యత్వ నమోదుపై చర్చ 

హైదరాబాద్‌, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షపై చర్చించేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) గాంధీభవన్‌లో శనివారం భేటీ కానుంది. దీక్షతో పాటు రైతుల సమస్యలు, డిజిటల్‌ సభ్యత నమోదు అంశాలపైనా చర్చించనున్నారు. తెలంగాణలో 9 నుంచి క్షేత్రస్థాయిలో డిజిటల్‌ సభ్యత నమోదు కార్యక్రమాలను చేపట్టనున్నారు. అయితే క్షేత్రస్థాయి డిజిటల్‌ సభ్యత్వ నమోదులో కీలకమైన ఎన్‌రోలర్ల నియామకం సగం మేర కూడా ఇంకా పూర్తి కాలేదు. దీనిపై టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మహే్‌షకుమార్‌గౌడ్‌లతో ఢిల్లీలో సమావేశమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌.. త్వరితగతిన ఎన్‌రోలర్ల నియామకం పూర్తి చేసి డిజిటల్‌ మెంబర్‌ షి ప్‌ వేగవంతం చేయాలని సూచించారు. దీంతో పీఏసీ సమావేశంలో ఈ అంశాన్నీ ప్రాధాన్యంగా తీసుకున్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశాన్నీ నిర్వహించి డిజిటల్‌ మెంబర్‌షి్‌ప కార్యవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించనున్నారు. 

Updated Date - 2021-12-04T07:34:16+05:30 IST