కరోనా వైరస్‌పై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోండి

ABN , First Publish Date - 2020-03-29T11:11:11+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఎదురయ్యే సవాళ్లను పోలీసులు ఎదుర్కోవాలని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ

కరోనా వైరస్‌పై ఎదురయ్యే సవాళ్లను  ఎదుర్కోండి

అర్బన్‌ పోలీసులకు ఆదేశాల్చిన అడిషనల్‌ డీజీపీ


రాజమహేంద్రవరం సిటీ, మార్చి 28: కరోనా  వైరస్‌ వ్యాప్తిని  అరికట్టేందుకు ఎదురయ్యే సవాళ్లను పోలీసులు  ఎదుర్కోవాలని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్త ఆదేశించారు. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయ న ముఖ్యఅధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 వైరస్‌ గురించి కేంద్ర ప్రభుత్వం దీనిని నేషనల్‌ డిజస్టర్‌గా భావించి ఎమర్జెన్సీని ప్రకటించిందన్నారు.


ప్రజలకు సేవ చేస్తున్నా ము అనే ధ్రుక్పథంతో కలిసి పనిచేయాలన్నారు. వచ్చేనెల 14 తర్వాత లాక్‌డౌన్‌ ను పొడిగించిన దానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. వైరస్‌ వ్యాప్తి చెంద కుండా ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. పోలీసుల కుటుంబాలను కూడా అప్రమత్తం చేయాలని వారికి అవసరమైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మందులు, నిత్వావసరాల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం అర్బన్‌ డీఎస్పీలు, సీఐలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అర్బన్‌ పరిధిలో రైతు బజార్లు, చెక్‌పోస్టులు, పికెట్స్‌ విధుల నిర్వహణపై ఆరాతీశారు. లాక్‌డౌన్‌ జరుగుతున్న సమయంలో దొంగతనాలు పెరుగుతాయని వాటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.


అర్బన్‌ పోలీసులకు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ద్వారా 5000 మాస్క్‌లు పంపించారని,   రాజమహేంద్ర వరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ 600 కళ్లద్దాలు ఇచ్చారని, జైన్‌ టెంపుల్‌ ట్రస్ట్‌ వారు 600 కళ్లజోళ్లు అందించారని వారికి అభినందనలు తెలుపుతున్నా మ న్నారు. అనంతరం అర్బన్‌ ఎస్పీ షిమొషిబాజ్‌పాయ్‌ మాట్లాడుతూ అర్బన్‌లో తీసుకుంటున్న చర్యలను వివరించారు. దీనిపై అడిషనల్‌ డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీలు వైవీ రమణకుమార్‌ పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-29T11:11:11+05:30 IST