Abn logo
Sep 24 2021 @ 23:52PM

చంద్రబాబును కలిసిన పొత్తూరి, కొవ్వలి

చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు

నరసాపురం, సెప్టెంబరు 24 : కలిసి కట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తేవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు  సూచించారు. టీడీపీ అధినేత పిలుపు మేరకు నరసాపురం నియోజక వర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, ఎన్‌ ఆర్‌ఐ కొవ్వలి నాయుడు అమరావతిలో చంద్రబాబును కలిశారు. సుమారు ఆర గంట పాటు చంద్రబాబు వీరితో చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, చేపట్టే కార్యక్రమాలపై ఆరా తీశారు. నరసాపురంలో పార్టీ కార్యక్రమాలకు కొత్తగా కార్యాలయాన్ని కడుతున్నామని అధినేతకు చెప్పారు.