‘అమ్మాయి బాగుంది’ (Ammayi bagundi) చిత్రంతో టాలీవుడ్లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్ (Meera Jasmin). ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. ఆమె అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఆపై ‘గుడుంబా శంకర్, భద్ర, రారాజు, ఆకాశరామన్న, అఆఇఈ, బంగారు బాబు, మా ఆయన చంటిపిల్లాడు, గోరింటాకు, యమగోల మళ్ళీ మొదలైంది, మహారథి’ లాంటి సినిమాల్లో అభినయించి తెలుగువారికి బాగా దగ్గరయింది. కెరీర్ బిగినింగ్‌లో గ్లామర్ షోకి అంతగా ప్రాముఖ్యతనివ్వలేదు. సౌందర్య తరహాలో కేవలం అభినయంతోనే మంచి మంచి అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. ‘మోక్ష’ (Moksha) చిత్రం తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ టాలీవుడ్ వైపు తొంగిచూడలేదు.
2014లో అనిల్ జాన్ టైటస్ (Anil John Titus) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితానికే అంకితమైపోయింది మీరా జాస్మిన్. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ప్రయత్నాల్లో ఉంది మీరా. దానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. తరచుగా తన క్లీవేజ్ షోస్ తో కూడిన పిక్స్ ను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొద్ది రోజుల క్రితం మీరా జాస్మిన్ నుంచి ఈ తరహా పిక్స్ ను చూసి ఆశ్చర్యపోయారు సౌత్ జనం. అంతలోనే మీరా జాస్మిన్ మరోసారి తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది.
తాజాగా మీరా జాస్మిన్ ఆకుపచ్చ డ్రెస్ లో క్లీవేజ్ షో (Cleavage show) తో దర్శనమిచ్చింది. నాలుగుపదుల వయసులోకి చేరిన ఈ బ్యూటీ.. పెద్ద చిత్రాల్లో అవకాశాల కోసమే మునుపెన్నడూ లేని విధంగా ఇలా గ్లామర్‌షో చేయడం ఆశ్చర్యమనిపించకమానదు. ఇటీవల మలయాళ చిత్రం ‘మగల్’ (Makal) లో జయరామ్ (Jayaram) భార్యగా నటించిన మీరా జాస్మిన్ త్వరలోనే టాలీవుడ్ లో ఓ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ప్రస్తుతం మీరా జాస్మిన్ గ్రీన్ డ్రెస్ షో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.