Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 01 Jul 2022 20:40:18 IST

అసత్యాలు ప్రచారం చేయొద్దంటున్న Meena

twitter-iconwatsapp-iconfb-icon

తెలుగు, తమిళ్‌తో పాటు పలు భాషలకు చెందిన సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న నటి మీనా (Meena). ఆమె భర్త విద్యా సాగర్ (Vidyasagar)జూన్ 29న ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు. ఆయన మరణంపై అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మీనా సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశారు. 


భర్త మరణంతో తీవ్ర విచారంలో ఉన్నామని మీనా పేర్కొన్నారు. ‘‘పరిస్థితిని అర్థం చేసుకుని మీడియా సంయమనం పాటించాలి. మాకు గోప్యతనివ్వాలి. నా భర్త మృతి విషయంలో ఎటుంటి అసత్యాలు ప్రచారం చేయవద్దు. ఇటువంటి ఇబ్బందికర సమయంలో సహృదయంతో మా కుటుంబానికీ అండగా నిలిచిన వారికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఐఏఏస్ ఆఫీసర్ రాధాకృష్ణన్, మిత్రులు, సన్నిహితులు అందరికీ ధన్యవాదాలు’’ అని మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. మీనా ఇంటికి సమీపంలో ఎక్కువ సంఖ్యలో పావురాలు ఉన్నాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లనే విద్యా సాగర్‌కు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని పలు పత్రికలు, వెబ్‌సైట్స్‌లో కథనాలు వెలువడ్డాయి. విద్యాసాగర్ కరోనా కారణంగాను ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనకు ఊపిరితిత్తులు మర్చాల్సి ఉండగా ఎంత ప్రయత్నించినా దాతలు దొరకలేదని ఇటీవల మీనా స్నేహితురాలు, టాప్ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ పేర్కొన్నారు. మీనాకు, విద్యాసాగర్‌తో 2009లో పెళ్లి అయింది. ఈ జంటకు ఒక కూతురు ఉంది. మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉండగానే కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలకు చెందిన పలు సినిమాల్లో నటించారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement