‘మీరే’ ఆస్తులు... ట్రిలియన్ మార్క్‌ను దాటయి...

ABN , First Publish Date - 2021-10-22T06:59:41+05:30 IST

‘మీరే’... అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి.

‘మీరే’ ఆస్తులు... ట్రిలియన్ మార్క్‌ను దాటయి...

న్యూఢిల్లీ : ‘మీరే’... అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి. పుష్కరకాలం కిందట(2008లో) భారతదేశంలో ఈ  కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. గడిచిన ఐదున్నరేళ్లలో కంపెనీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు పది రెట్లు పెరిగాయి. అక్టోబరు 14 నాటికి పరిమితిని అధిగమించింది. ఫండ్ హౌస్‌కు చెందిన ఇన్వెస్టర్స్ ఫోలియో కూడా 15.4 లక్షల సిస్టమాటిక్ ఇన్వెస్టర్ ప్లాన్ ఇన్వెస్టర్‌తో 43.7 లక్షలకు చేరుకుంది. దీని ఆస్తి పరిమాణం జూలై 31, 2021 నాటికి రూ. 19,568 కోట్లుగా ఉంది. తాజాగా దీని ఆస్తి పరిమాణం రూ. లక్ష కోట్లు దాటేసింది.  

Updated Date - 2021-10-22T06:59:41+05:30 IST