‘మీ వద్దకే మా వైద్యం’

ABN , First Publish Date - 2022-04-24T14:11:17+05:30 IST

శ్రీపురం నారాయణి ఆస్పత్రి నూతనంగా ‘మీ వద్దకే మా వైద్యం’ అనే పథకం ప్రారంభించింది. ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆస్పత్రి డైరెక్టర్‌

‘మీ వద్దకే మా వైద్యం’

                 - ప్రారంభించిన నారాయణి ఆస్పత్రి


వేలూరు(చెన్నై): శ్రీపురం నారాయణి ఆస్పత్రి నూతనంగా ‘మీ వద్దకే మా వైద్యం’ అనే పథకం ప్రారంభించింది. ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆస్పత్రి డైరెక్టర్‌ డా.బాలాజి అధ్యక్షత వహించగా, వేలూరు ఎమ్మెల్యే కార్తికేయన్‌ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో వైద్యచికిత్సలు అవసరమైన వారు ఆస్పత్రి ఫోన్‌ నెంబర్లను సంప్రదిస్తే వైద్యులు నేరుగా వారి ఇంటికే వెళ్లి వైద్యపరీక్షలు, చికిత్సలు అందించనున్నారు. ఆపరేషన్‌ తర్వాత కూడా వైద్యులు, సిబ్బంది ఇళ్ల వద్దకే వెళ్లి రోగులను పరామర్శించనున్నారు. వైద్యచికిత్సలు అవసరమైన వారు 0416- 2206300, 7200999884 అనే నెంబర్లను సంప్రదించాలని ఆస్పత్రి డైరెక్టర్‌ బాలాజి తెలిపారు. కార్యక్రమంలో వేలూరు మేయర్‌ సుజాత సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T14:11:17+05:30 IST