హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా ‘మీ సేవ’లు

ABN , First Publish Date - 2022-09-23T05:53:17+05:30 IST

రైతులకు ఉపయుక్తంగా నిలిచేలా మీ సేవ కేంద్రాలు హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా సేవలు అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ‘ధరణి’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా ‘మీ సేవ’లు

భూ సమస్యల పరిష్కారం కోసం మండలస్థాయిలో ‘ప్రజావాణి’ 

కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌, సెప్టెంబరు 22: రైతులకు ఉపయుక్తంగా నిలిచేలా మీ సేవ కేంద్రాలు హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా సేవలు అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ‘ధరణి’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూ సమస్యల విషయంలో రైతులచే సరైన విధంగా ధరణిలో దరఖాస్తులు చేయించడంలో మీ సేవ కేంద్రాల నిర్వహకులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మీసేవ కేంద్రాల ఆపరేటర్లకు ధరణికి సంబంధించి అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సూచించారు. డివిజన్‌ల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించాలని మీసేవ కేంద్రాలు హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా ఉపయోగపడేలా చూడాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం కనీసం 5వారాల పాటు మండలస్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి సోమవాం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు ప్రత్యేకంగా భూ సంబంధిత సమస్యలపైనే ప్రజావాణి నిర్వహించాలని తహసీల్దార్‌తో పాటు ఆర్‌ఐ, సర్వేయర్‌ తప్పనిసరిగా ప్రజావాణిలో అందుబాటులో ఉండాలన్నారు. అర్హులైన ప్రతి రైతుకూ పట్టాపాస్‌బుక్‌ రావాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆయా మండలాల తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T05:53:17+05:30 IST