Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్... 13-15 తేదీల్లో ఐపీఓ...

హైదరాబాద్ : హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న  ఫార్మసీ చైన్‌ ‘మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్’ ఐపీఓ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13(సోమవారం)న ప్రారంభమై, 15 న ముగియనుంది. ఐపీఓ లక్ష్యం... రూ.1,398 కోట్లు. ప్రైస్‌ బ్యాండ్‌ను రూ. 780-రూ. 796 గా నిర్ణయించారు. ఒక్కో లాట్‌కు 18 షేర్లు ఉంటాయి, 18 మల్టిపుల్స్‌లో దరఖాస్తు  చేసుకోవాలి. ఈ ఇష్యూలో రూ. 600 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తున్నారు, రూ. 798 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో అమ్మేస్తున్నారు.


అజీమ్‌ ప్రేమ్‌జీ కంపెనీ ‘ప్రేంజీ ఇన్వెస్ట్’కు చెందిన ‘పీఐ ఆపర్చ్యునిటీస్ ఫండ్‌’కు కూడా ఇందులో పెట్టుబడులున్నాయి. ఇది దాదాపు రూ. 623 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్‌ చేస్తోంది. నాట్కో ఫార్మా  రూ. 10 విలువైన షేర్లను అమ్మేస్తోంది. రూ. 5 కోట్ల విలువైన షేర్లను సంస్థ ఉద్యోగులకు రిజర్వ్‌ చేశారు. వీరికి ఒక్కో షేరుపై రూ. 78 తగ్గించి జారీ చేస్తారు. ఏడాది కాలంలో 700 పైగా కొత్త స్టోర్లను ప్రారంభించామని, ఈ క్రమంలో... వీటి సంఖ్య రెండు వేల పైకి చేరిందని కంపెనీ వెల్లడిచింది. 

Advertisement
Advertisement