నిత్య జీవితంలో ధ్యానాన్ని భాగం చేసుకోవాలి : పీవీ సింధు

ABN , First Publish Date - 2022-08-15T05:40:07+05:30 IST

నిత్య జీవితంలో ధ్యానాన్ని భాగం చేసుకోవాలి : పీవీ సింధు

నిత్య జీవితంలో ధ్యానాన్ని భాగం చేసుకోవాలి : పీవీ సింధు

షాద్‌నగర్‌/నందిగామ, ఆగస్టు, 14: ధ్యానం, దయ అనే ఈ రెండు పదాలు మనిషి జీవితంలో భాగమని, ప్రతి ఒక్కరూ ఈ రెండింటినీ విధిగా అలవర్చుకోవాలని అంతర్జాతీయ బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. నందిగామ మండల పరిధి కన్హా శాంతివనంలో జరుగుతున్న మూడు రోజుల కైండ్‌నెస్‌ యూత్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆమె జూమ్‌ యాప్‌లో మాట్లాడారు. యువత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు రోజూ ధ్యానం చేయాలన్నారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, నిత్యం కొత్త ఆలోచనలతో ముందుకు సాగవచ్చన్నారు. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధించవచ్చన్నారు. దయాగుణాన్ని అలవర్చుకొని ప్రతి ఒక్కరూ తమ మనస్సాక్షికి దగ్గరగా ఉండాలన్నారు. ఆధ్యాత్మిక వేత్త కమలేష్‌ పటేల్‌ దాజీ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన విద్యార్థులు భవిష్యత్తు తరాలకు జ్ఞానాన్ని అందించాలని కోరారు. విజ్ఞానాన్ని ఆర్జించిన పెద్దలంతా సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:40:07+05:30 IST