Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెరుగైన శ్వాసకు ధనురాసనం

ఆంధ్రజ్యోతి(10-05-2020):

ఈరోజు యోగాసనంలో ధనురాసనం ప్రాక్టీస్‌ చేయండి. ఈ ఆసనం వెన్నెముకను బలోపేతం చేస్తుంది. మెడ, వీపు భాగంలో కండరాల ఒత్తిడిని దూరం చేస్తుంది. రక్తసరఫరాను పెంచుతుంది. ఆస్తమా ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఆసనం ఎలా చేయాలంటే...


యోగా మ్యాట్‌పై బోర్లా పడుకోవాలి. చేతులు, కాళ్లు రిలాక్స్‌గా పెట్టాలి.


ఇప్పుడు కాళ్లు వెనక్కి మలిచి ఎడమ చేత్తో, ఎడమ అరికాలు 

(చీలమండ) భాగంలో పట్టుకోవాలి. కుడి చేత్తో కుడి కాలు చీలమండ భాగంలో పట్టుకోవాలి.


శ్వాసను పీల్చుతూ మెల్లగా ఛాతీని పైకెత్తాలి. అదే సమయంలో చేతులతో కాళ్లను లాగుతూ, ఎంతవీలైతే అంతపైకి ఛాతీ లేపాలి.


శ్వాసను వదులుతూ నెమ్మదిగా ఛాతీని కిందకు తీసుకురావాలి. కాళ్లను వదిలిపెట్టి సాధారణ స్థితికి రావాలి.

Advertisement
Advertisement