మేడిగడ్డ బ్యారేజీకి తగ్గిన ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-06-30T05:39:24+05:30 IST

మేడిగడ్డ బ్యారేజీకి తగ్గిన ఇన్‌ఫ్లో

మేడిగడ్డ బ్యారేజీకి తగ్గిన ఇన్‌ఫ్లో

మహదేవపూర్‌ రూరల్‌, జూన్‌ 29 : కాళేశ్వరం ప్రాజె క్టులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహ దేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నుం చి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండగా  ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. బుధవారం బ్యారేజీలోని 10 గేట్ల ను ఎత్తి దిగువకు 14,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  ఇన్‌ఫ్లో మంగళవారం 17,320 క్యూసెక్కులుగా ఉంది. బుధవారం 8,900 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధి కారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీలో 9.63 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. అన్నారం బ్యారేజీలోకి ఇతర ప్రవాహాల ద్వారా 650 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా గేట్లను మూసి ఉంచినట్టు చెప్పా రు. బ్యారేజీలో ప్రస్తుతం 6.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-30T05:39:24+05:30 IST