మేడిగడ్డ బ్యారేజీ 79 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-27T15:50:54+05:30 IST

మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగు తోంది.

మేడిగడ్డ బ్యారేజీ 79 గేట్లు ఎత్తివేత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగు తోంది. అధికారులు 79 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,03,900 క్యూసెక్కులుండగా బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 1.768 టీఎంసీలుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతి) బ్యారేజీ వద్ద అధికారులు 62 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 35,000 క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో 20,000 క్యూసెక్కులుంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 0.88 టీఎంసీలకు చేరుకుంది.

Updated Date - 2021-07-27T15:50:54+05:30 IST