నెల్లూరులో మెడికవర్‌ హాస్పిటల్‌

ABN , First Publish Date - 2020-02-20T06:24:06+05:30 IST

మెడికవర్‌ గ్లోబల్‌ నెల్లూరులో 250 పడకల ఆసుపత్రిని ప్రారంభించింది. దీంతోపాటు మెడికవర్‌ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంఓఐ)ను ఏర్పాటు చేయనున్నట్లు

నెల్లూరులో మెడికవర్‌ హాస్పిటల్‌

విస్తరణకు మరో రూ.300 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మెడికవర్‌ గ్లోబల్‌ నెల్లూరులో 250 పడకల ఆసుపత్రిని ప్రారంభించింది. దీంతోపాటు మెడికవర్‌ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంఓఐ)ను ఏర్పాటు చేయనున్నట్లు మెడికవర్‌ గ్లోబల్‌ సీఈఓ ఫెడ్రిక్‌ రాగ్‌మార్క్‌ తెలిపారు. మెడికవర్‌ గ్లోబల్‌ వ్యాపారంలో భారత్‌ కేంద్ర బిందువుగా మారిందని, ఈ మార్కెట్లో పెట్టుబడులు కొనసాగిస్తామని ఫెడ్రిక్‌ తెలిపారు. ఇప్పటివరకు రుణం, ఈక్విటీ రూపంలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. నెల్లూరులోని ఎంఓఐ సహా రానున్న ప్రాజెక్టుల్లో మరో రూ.300 కోట్లు పెట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ హైదరాబాద్‌, కర్నూ లు, విశాఖపట్నంలో మెడికవర్‌ ఆసుపత్రులున్నాయని మెడికవర్‌ ఇండియా చైర్మన్‌ అనిల్‌ కృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లో 500 పడకల ఆసుపత్రి కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో మరో 500 పడకల సామర్థ్యాన్ని సమకూర్చుకోనున్నాం. ఇందుకోసం విశాఖపట్నంలో 200, శ్రీకాకుళంలో 300 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-02-20T06:24:06+05:30 IST