Abn logo
Dec 5 2020 @ 23:05PM

నట్టల నివారణ మందు పంపిణీ

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 5: జిల్లాలోని ఆయా మండలాల్లో శనివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఆసిఫాబద్‌మండలంలోని ఈదలువాడ, ఆసిఫాబాద్‌లలో పశువైద్యాధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో  మేక లు, గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భీమేష్‌, సిబ్బంది పురుషోత్తంపాల్గొన్నారు. 

రెబ్బెన: మండలంలోని గోలేటి గ్రామంలో గొర్రెలు, మేకలకు  నట్టల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా 74 గొర్రెలు, 414 మేకలకు నట్టల నివారణ మందులు వేసినట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పోటు సుమలతరెడ్డి, ఎంపీటీసీలు సాగరమ్మ, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. 

వాంకిడి: మండలంలోని జైత్‌పూర్‌ గ్రామంలో  1,170 మేకలకు, 369 గొర్రెలకు నట్టల నివారణ  మందు వేశామని పశువైద్యాధి కారి శివప్రసాద్‌ అన్నారు.. మండలంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది గణపతి, రాజు, నరేష్‌, బాలాజీ, లాలాజీ, సుమన్‌, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement