కరోనా పేషెంట్లకు ఉచితంగా మందులు

ABN , First Publish Date - 2021-05-07T04:05:16+05:30 IST

కొవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్లకు ఉచితంగా మెడికల్‌ కిట్లు అందజేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ తెలిపారు. పట్ట ణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో కరోనా బారిన పడుతున్న వారికి అండగా ఉండటా నికి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి ఉచితంగా డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఇస్తున్నామన్నారు.

కరోనా పేషెంట్లకు ఉచితంగా మందులు
ఉచిత మెడికల్‌ కిట్లను చూపుతున్న వెరబెల్లి రఘునాథ్‌

ఏసీసీ, మే 6 : కొవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్లకు ఉచితంగా మెడికల్‌ కిట్లు అందజేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ తెలిపారు. పట్ట ణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో కరోనా బారిన పడుతున్న వారికి అండగా ఉండటా నికి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి ఉచితంగా డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఇస్తున్నామన్నారు. డాక్టర్‌ సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఉచితంగా మందులను కార్యకర్తల ద్వారా అందజేస్తున్నామన్నారు. తేలికపాటి లక్షణా లున్న వారు డాక్టర్ల సూచన మేరకు సరైన మందులు వాడితే త్వరగా కోలుకోవచ్చన్నారు. కొవిడ్‌ లక్షణాలున్న వారు హెల్ప్‌లైన్‌ 9160603222 నం బర్‌ను ప్రతీ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు సంప్రదించ వచ్చన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు రజనీష్‌ జైన్‌, యువమోర్చా జిల్లా అధ్య క్షుడు వెంకటకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌, తోట మల్లికార్జున్‌, పల్లె రాకేష్‌, జాడి సత్యనారాయణ, కుర్రె చక్రవర్తి  పాల్గొన్నారు. 

దండేపల్లి: గుడిరేవుకు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో బీజేపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘనాథ్‌రావు హోం ఐసోలేషన్‌ కిట్లను గురువారం అందజేశారు. ఉచిత హెల్ప్‌లైన్‌ ద్వారా ఫోన్‌ చేసిన బాధితులకు వైద్యుల సూచన మేరకు బాధితుల ఇండ్లకు వెళ్లి కిట్లు అందజేసి వారిలో మనోధైర్యం కల్పించారు.  


Updated Date - 2021-05-07T04:05:16+05:30 IST