భయో..వేస్ట్‌

ABN , First Publish Date - 2022-08-20T06:34:35+05:30 IST

ఆసుపత్రికి వెళితే కనీసం డస్ట్‌బిన్‌ చూడడానికే చాలా మంది ఇష్టపడరు.. ఎందుకంటే ఆ డస్ట్‌బిన్లలో ఎటువంటి ప్రమాదకర క్రిములు ఉంటాయోనని భయం..

భయో..వేస్ట్‌

మెడికల్‌ వ్యర్థాలతో అనర్థం

బయోమెడికల్‌ వ్యర్థాలతో డేంజరే

వాటి  నిర్వహణ ఓ చాలెంజ్‌

ఉమ్మడి జిల్లాల్లో  1200 ఆసుపత్రులు

రోజుకు వేల కేజీల వ్యర్థాలు

ప్రస్తుతం పల్ల కడియంలోనే ప్లాంట్‌

ప్రజల్లో భయాందోళన

మర్రిపూడిలో అడ్డుకుంటున్న ప్రజలు 


ఆసుపత్రికి వెళితే కనీసం డస్ట్‌బిన్‌ చూడడానికే చాలా మంది ఇష్టపడరు.. ఎందుకంటే ఆ డస్ట్‌బిన్లలో ఎటువంటి ప్రమాదకర  క్రిములు ఉంటాయోనని భయం.. సిబ్బంది కూడా మాస్క్‌లు వేసి కానీ ఆ వేస్టేజ్‌ను బయటపడేయరు.. ఎందుకంటే ఆ వ్యర్థాలతో అంత ప్రమాదం.. కాస్త నిర్లక్ష్యంగా ఉంటే అనారోగ్యం బారిన పడడం ఖాయం.. ఒక్క డస్ట్‌బిన్‌ గురించే ఇంతలా ఉంటే.. జిల్లాలోని ఆసుపత్రుల చెత్త అంతా అక్కడే వేస్తామంటే ఎలా?         ఆ వ్యర్థంతో అనర్థమే కదా.. అందుకే మర్రిపూడి తదితర గ్రామాల ప్రజలు గత 90 రోజులుగా బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు.


 (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

మానవులు అనేక రోగాలతో.. ప్రమాదాలతో ఆసు పత్రి పాలవుతారు. అక్కడ రకరకాల వైద్యం చేస్తారు.అవసర మైతే ఆపరేషన్లు చేస్తారు. లేదంలే మందులు ఇస్తారు.   ఆపరేషన్‌ చేసిన సమయంలో మనిషిలో ఉన్న వేస్టేజ్‌ అంతా బయటకు తీసేస్తారు.. అంతే కాకుండా ఆపరేషన్‌ చేసే సమయంలో  సిరంజిలు, సూదులు,  సెలైన్‌ బాటిల్స్‌, ఇంజక్షన్‌ బాటిల్స్‌, సిమెంట్‌ కట్లు తదితరాలు ఉపయో గిస్తారు. దీంతో ఆర్‌ఎంపీ నుంచి  కార్పొరేట్‌ ఆసుపత్రి వరకూ ప్రతి చోట వ్యర్థాలు ఉంటాయి. ఈ వేస్టేజ్‌ అంతా ఎక్కడ వేస్తారు.. ఇప్పటి వరకూ చాలా మందిని వేధించే ప్రశ్న ఇది..ఈ వేస్టేజ్‌ను ఊళ్లకు దూరంగా ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి మండిస్తారు. ఆ బూడిదను దూరంగా పడే స్తారు. అయితే వీటి నిర్వహణ విషయంలో ఇంత వరకూ ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ఎక్కడపడితే అక్కడ బయో మెడికల్‌ వేస్టేజ్‌ బర్నిం గ్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేస్తున్నారు.ఆ ఫ్యాక్టరీ గురించి తెలుసుకున్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.మర్రిపూడిలో ఆరు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నది ఇటువంటి ఫ్యాక్టరీనే. 


ప్రజాభిప్రాయం పక్కన పెట్టి..


కుక్క చనిపోతే రోడ్డు పక్కన పడేస్తారు.. పశువుల చనిపోతే ఊరి చివర పడేస్తారు. వాటిని ఎవరూ పట్టించుకోరు. ఇక మనిషికి సంబంధించిన వ్యర్థాలు.. వాటి సంగతి ఇంతే..వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా లేదనే చెప్పవచ్చు. ఆసుపత్రి పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లోకి వెళ్లినా.. కాలు వలను చూసినా కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తాయి.      కొవిడ్‌ సమయంలో వ్యర్థాలను గోతులు తీసి కప్పెట్టిన సందర్భాలే ఎక్కువ. ఆ అలవాటు ఇంకా చాలా ఆసుప త్రుల్లో పోలేదు. ఇంకా అలాగే చేస్తున్నారు. దీంతో ప్రజలు అనేక రకాల రోగాల భారిన పడే ప్రమాదం ఉంది.   ఆసుపత్రి వ్యర్థాలను మండించి బూడిద చేయడమే మంచి మార్గం. కానీ ఈ ప్రకియ జనావాసాలకు దూ రంగా చేయాలి. గతంలో ప్రమాదకరమైన పరిశ్రమలు ఊళ్లకు దూరంగా పెట్టేవారు. ప్రస్తుతం ఇటువంటి పరిశ్రమలను జనం మఽధ్య పెట్టేస్తున్నారు.ఇది ప్రమాదకరమైనా ప్రభు త్వం పట్టించు కోవడంలేదు. అధికారులు కనీసం ప్రజాభి ప్రాయానికి విలు వ ఇవ్వకుండా అనుమతులు ఇచ్చేస్తు న్నారు.మర్రిపూడిలో ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వవద్దంటూ ఆరు గ్రామాల ప్రజలు వ్యతిరేకించినా అనుమతులు వచ్చాయంటే  పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

   

ఇప్పటికే పల్ల కడియంలో ఫ్యాక్టరీ.. 


పాత ఉభయగోదావరి జిల్లాలన్నింటికీ రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో సుమారుగా 2002లో పెట్టిన బయోమెడికల్‌  వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీ ఒక్కటే ఉంది. అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికే వ్యర్థాలు వస్తుంటాయి. ఈ ఏడాది మొదట్లో ఇక్కడ ప్రజలు ఆందోళన చేసి కొద్దిరోజులు ఈ పరిశ్రమను మూసివేయించారు. అయితే కొందరు రాజకీయనాయకులు జోక్యంతో ఈ పరిశ్రమ మళ్లీ తెరచుకుంది. పొగ ఎక్కువగా వస్తుందని, బూడిద కూడా అక్కడే ఉంచేస్తున్నారని చెబుతున్నారు.  దీంతో రకరకాల భయాలు మొదలయ్యాయని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ ఇన్‌సినెరేటర్‌ అనే యంత్రంతో వ్యర్థాలను దగ్ధం చేస్తారు. దీని నుంచి పొగ వస్తుందని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ డీజిల్‌తో ఈ వ్యర్థాలను  1000 డిగ్రీల వేడితో బర్న్‌ చేస్తారు. బూడిదను విశాఖలోని రాంకీ పరిశ్రమకు తరలించాలి.. కానీ అలా జరగడంలేదని ప్రజలు చెబుతున్నారు. ఈ ప్లాంట్‌కు  ఆసుపత్రుల నుంచి వ్యర్థాలను సేకరించడానికి ఈవీబీ టెక్నాలజీ సంస్ధ ఆసుపత్రులతో ఒప్పందం పెట్టుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ వ్యర్థాలను సేకరిస్తారు. ముందుగానే కవర్లు ఇచ్చి ఆసుపత్రుల్లో రెండు రకాలుగా వేరుచేసి కవర్లలో వేయిస్తారు. తర్వాత వాహనాల్లో పల్లకడియం ప్లాంట్‌కు తరలిస్తారు. దీని కోసం బెడ్‌కు ఇంత అని ఆసు పత్రి యాజమాన్యం చెల్లించాలి.రూ.వేలల్లోనే ఈరేటు ఉంటుంది.


వందల్లో ఆసుపత్రులు..


ఉమ్మడి తూర్పు జిల్లాలో 1200 వరకూ ఆసుపత్రులు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ జిల్లా కూడా సుమారు అదే స్థాయిలో ఉంటాయి. ఆసుపత్రులే కాక, లేబొరేటరీలు, పశువులు ఆసుపత్రులు, మందులు ఫ్యాక్టరీలు, రసాయనాల పరిశ్రమలు వంటిని అనేకం ఉంటాయి. వీటి నుంచి ప్రతి రోజూ వేల కేజీల వ్యర్ధాలు తయారవుతున్నాయి. కానీ అవన్నీ సక్రమంగా బూడిద చేస్తున్నారా అంటే లేదనే చెప్పవచ్చు.దానికే మన కళ్లకు కనిపించే గోదావరే ఒక ఉదాహరణ. గోదావరి పరీవాహక ఫ్యాక్టరీ వ్యర్థాలన్నీ ఆ జీవనదిలోనే కలిపేస్తున్నారు. 


మర్రిపూడిలోనూ ఇదే సమస్య


గోదావరి బయోమెడికల్‌  వేస్ట్‌మేనేజ్మెంట్‌ పరిశ్రమను మర్రిపూడిలో పెట్టాలనే ప్రయత్నాన్ని ప్రజలు అడ్డు కుంటున్నారు. పల్లకడియంలో పెట్టే సమయంలో ప్రజల్లో చైతన్యం తక్కువ. ప్రస్తుతం చైతన్యం పెరగడంతో ప్రజలంతా ఒకటయ్యారు. ప్రజల ఐక్యతను చూసి, రాజకీయనేతలు మద్దతు ప్రకటిస్తున్నారు.


సక్రమ నిర్వహణ లేకపోతే ప్రమాదమే..  

  బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అనేది సక్రమంగా ఉండాలి. లేకపోతే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అన్ని చర్యలు తీసుకునే ఇటువంటి వాటికి అనుమతి ఇస్తుంటా. జిల్లాలో పల్లకడియంలో ఒకటే ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు అది ఒకటే.. ఇక్కడ ఎక్కువైనా, ఇబ్బంది ఉన్నా వేరే జిల్లాకు తరలించే అవకాశం నిర్వాహకులకు ఉంది. బూడిదను స్థానికంగా పారేయకూడదని,  విశాఖలోని రాంకీ  పరిశ్రమకు పంపించాలి. జాగ్రత్తగా లేకపోతే వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. 

అశోక్‌కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ



నిబంధనలు పాటించాల్సిందే..

ప్రభుత్వాసుపత్రిలోని బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. లేదంటే ప్రమాదం. ఆసుపత్రి సిబ్బంది చేతులకు గ్లౌజులు, తలపై కేప్స్‌ వంటివి ఇవ్వడంతో పాటు వ్యర్థాలను బయటకు తరలించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. బయోమెడికల్‌ వేస్ట్‌ తీసుకెళ్లే సిబ్బంది నిర్లక్ష్యం గా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న థర్డ్‌పార్టీ ఏజెన్సీకి కిలోల లెక్కన బయోమెడికల్‌ వ్యర్థాలను తరలిస్తాం. వీటికి డబ్బులు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. 

-  డాక్టర్‌ పాల్‌ సతీష్‌కుమార్‌,  ప్రభుత్వాసుపత్రి  సూపరింటెండెంట్‌


Updated Date - 2022-08-20T06:34:35+05:30 IST