చెన్నైకి వెళ్లే వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి

ABN , First Publish Date - 2020-06-09T16:13:10+05:30 IST

పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 200 మందికిపైగా

చెన్నైకి వెళ్లే వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి

చెన్నై : శివారు ప్రాంతమైన పల్లావరం నుంచి చెన్నైకి వెళ్లే వారికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించాలని మున్సిపాలిటీ నిర్ణయించింది. చెంగల్పట్టు జిల్లా పల్లావరం మున్సిపాలిటీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 200 మందికిపైగా ఈ వైరస్‌కు గురయ్యారు. చెన్నై నుంచి పనుల కోసం పల్లావరం వచ్చే వారికి, ఉద్యోగాల కోసం పల్లావరం నుంచి చెన్నై వెళ్లే వారి ద్వారా వైరస్‌ వ్యాపిస్తున్నట్టు అధికారులు భావిస్తు న్నారు. వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో ఉన్న వారి వివరాలను సేకరించేలా 32వార్డుల్లో సర్వే చేపట్టేవారు. అంతేకాకుండా చెన్నైకి ఉద్యోగాలకు వెళ్లే వారి వివరాలు సేకరించి వారికి వైద్యపరీక్షలు నిర్వహించా లని,  అంగీకరించని వారికి జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-09T16:13:10+05:30 IST