కందమూరులో డెంగ్యూ నమోదుపై వైద్యుల ఆరా

ABN , First Publish Date - 2022-05-27T04:39:13+05:30 IST

మండలంలోని సౌత్‌మోపూరు పీహెచ్‌సీ పరిధిలోని కందమూరులో డెంగ్యూ కేసు నమోదుపై వైద్యుల బృందం గురువారం గ్రామంలో విచారణ చేపట్టారు. లార్వాను పరిశీలించారు.

కందమూరులో డెంగ్యూ నమోదుపై వైద్యుల ఆరా
డెంగ్యూపై ఆరా తీస్తున్న వైద్యుల బృందం

నెల్లూరురూరల్‌, మే 26 : మండలంలోని సౌత్‌మోపూరు పీహెచ్‌సీ పరిధిలోని కందమూరులో డెంగ్యూ కేసు నమోదుపై వైద్యుల బృందం గురువారం గ్రామంలో విచారణ చేపట్టారు. లార్వాను పరిశీలించారు. డెంగ్యూ నమోదైన వ్యక్తి ఇంటికి సమీప ప్రాంతాల్లో జ్వరాలు, నీటి నిల్వలపైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ, పీహెచ్‌సీ వైద్యురాలు ఎస్‌ కవిత మాట్లాడుతూ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా క్షేత్ర స్థాయిలోని తమ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ యూనిట్‌ అధికారి నాగరాజు, పీహెచ్‌సీ సూపర్‌వైజర్లు కృపవరం, రసూల్‌బీ, ఎస్తేరమ్మ, పంచాయతీ కార్యదర్శి సుప్రియ, ఏఎన్‌ఎం ప్రశాంతి, ఆరోగ్య సహయకులు విజయసారధి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T04:39:13+05:30 IST