తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు జీతం రూ.1,25,000

ABN , First Publish Date - 2021-10-20T14:53:07+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా..

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు జీతం రూ.1,25,000

హైదరాబాద్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)....రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో మెడికల్‌ టీచింగ్‌ స్టాఫ్‌ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, సైకియాట్రీ, అనెస్తీషియాలజీ తదితరాలు


వైద్య కళాశాలలు: జీఎంసీ వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, భధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల్‌, రామగుండం 


అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్‌ ఉత్తీర్ణత. టీచింగ్‌/పరిశోధన అనుభవంతోపాటు తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.


జీతభత్యాలు: ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,90,000, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,50,000, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులకు రూ.1,25,000 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి


దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 28


వెబ్‌సైట్‌: https://dme.telangana.gov.in/

Updated Date - 2021-10-20T14:53:07+05:30 IST