Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 30 Apr 2022 11:43:35 IST

అంబులెన్స్‌లో నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి.. ఎదురుగా రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. చివరకు..

twitter-iconwatsapp-iconfb-icon
అంబులెన్స్‌లో నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి.. ఎదురుగా రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. చివరకు..

అటవీ ప్రాంతాల ప్రజలు నిత్యం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. ఎప్పుడు ఏ అడవి జంతువు దాడి చేస్తుందో అనే ఆందోళనతో భయం భయంగా జీవనం సాగిస్తుంటారు. మరోవైపు కనీస వసతులు కూడా లేక నిత్యం నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అనారోగ్యానికి గురైనప్పుడు సరైన వైద్య సదుపాయం అందక నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే... తమిళనాడు పరిధిలోని గిరిజన ప్రాంతంలో ఓ నిండు గర్భిణికి పురటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మధ్యలో ఓ ఏనుగు రోడ్డుకు అడ్డుగా వచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..

తమిళనాడు ఈరోడ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా గిరిజనులు నివాసం ఉంటున్న ప్రాంతంలో గురువారం ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. సమీపంలో ఆస్పత్రి లేకపోవడంతో అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది గర్భిణిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో ఓ ఏనుగు వారికి అడ్డుగా వచ్చింది. పక్కకు కదలకుండా అలాగే ఉండిపోయింది. దీంతో చేసేదిలేక అంబులెన్స్ డ్రైవర్ కూడా.. వాహనాన్ని అక్కడే నిలిపేశాడు.

కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా ఊహించని ఘటన.. పెళ్లి మంటపంలో కలకలం.. వరుడికి మైండ్‌బ్లాక్..!

మరోవైపు గర్భిణికి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వైద్య సిబ్బంది చివరకు ఆమెకు వాహనంలోనే ప్రసవం చేశారు. మగబిడ్డకు జన్మనివ్వడంతో పాటూ, తల్లీబిడ్డా క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కాసేపటికి ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వైద్య సిబ్బందిని అంతా అభినందించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కదులుతున్న రైలు నుంచి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు యువతులు జంప్.. గమనించిన హోంగార్డు వెంటనే కిందకు దిగి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. పెట్రోల్‌ బాటిల్‌తో సహా ఆ ప్రేయసి నేరుగా అతడి ఇంటికెళ్లి..కూతురి పీకలమీదకు తెచ్చిన తండ్రి నిర్వాకం.. ఆమెను ప్రేమిస్తున్న కుర్రాడి వద్ద అప్పు తీసుకుని..పెళ్లయినప్పటి నుంచి దిగులుగా ఉంటున్న యువతి.. మూడు నెలల తర్వాత.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...దూడను మింగేయాలని కాలును పట్టుకున్న కొండచిలువు.. అయినా లెక్కచేయని లేగదూడ.. చివరకు..videoదండలు మార్చుకున్న వధూవరులు.. అనంతరం స్నేహితులంతా కలిసి వధువును ఓ గదికి తీసుకెళ్లగా... మరుక్షణమే ఊహించని ఘటన... సున్నం కొడుతుండగా.. స్టోర్ రూమ్‌లో బయటపడ్డ పాత సంచి మూటలు.. అనుమానం వచ్చి ఒకదాన్ని తెరచి చూడగా...
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.