వైద్యసేవలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

వైద్యసేవలను వినియోగించుకోవాలి

వైద్యసేవలను వినియోగించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న చంద్రయ్య

  • రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ చంద్రయ్య

కీసర, ఆగస్టు 11 : ప్రతీఒక్కరు ప్రభుత్వ వైద్యశాలలో అం దిస్తున్న వైద్య సేవ లను విని యోగిం చుకో వాలని రాష్ట్ర మానవ హక్కు కమి షన్‌ చైర్మన్‌ జి. చంద్ర య్య అన్నారు. గురువారం మండల కేంద్రం కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఆరోగ్య, వైద్యశాఖ నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో వైద్యసేవలందిస్తుందన్నారు. అదేవిధంగా సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఐహెచ్‌ఐపీ(ఇంటెగ్రేడెట్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ ఫామ్‌, ఎన్‌సీడీ, కేసీఆర్‌ కిట్‌, తల్లి, పిల్లల సంరక్షణ చర్యలపై ఆయన వైద్యులకు సలహాలు, సూచనలు అందించారు. డెంగీ కేసులు పెరుగుతున్నందునప అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు మంజురు చేసిన సెలవులను మాత్రమే వినిమోగించుకోవాలని బస్తీ దవాఖానా వైద్యులకు తెలియజేశారు. అనంతరం వజ్రోత్సవాల్లో భాగంగా చంద్రయ్య, వైద్యుడు శ్రీనివాస్‌ ఆరోగ్యకేంద్రంలో మొక్కలు నాటారు. 

Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST