గ్రామ స్థాయిలో వైద్య సేవలు విస్తృతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-20T05:28:41+05:30 IST

గ్రామస్థాయిలో వైద్యసేవలను విస్తృతం చేసేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌. కె.లీలాప్రసాద్‌ అన్నారు.

గ్రామ స్థాయిలో వైద్య సేవలు విస్తృతం చేయాలి
జి.మాడుగుల పీహెచ్‌సీలో నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న ఏడీఎంహెచ్‌వో


ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ 

జి.మాడుగుల, మే 19: గ్రామస్థాయిలో వైద్యసేవలను విస్తృతం చేసేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌. కె.లీలాప్రసాద్‌ అన్నారు. గురువారం ఆయన స్థానిక పీహెచ్‌సీలో జి.మాడుగుల, గెమ్మెలి పీహెచ్‌సీల వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఫీవర్‌ సర్వేను సకాలంలో చేపట్టాలని, కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందించాలని, ఆర్‌సీహెచ్‌ పోర్టర్‌లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. స్ర్పేయింగ్‌ పనులు ప్రతీ ఇంటికి జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆస్పత్రిలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామన్నారు. పీహెచ్‌సీలో బర్త్‌ వెయిటింగ్‌ హోమ్‌, వార్డులను తనిఖీ చేశారు. మందుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాతా,శిశుమరణాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని,  రెండు పీహెచ్‌సీల రికార్డులను పరిశీలించారు. ఈ సమావేశంలో వైద్యులు రమేశ్‌బాబు, విఘ్నేష్‌, సోమదొర, ఎపిడిమిక్‌ సెల్‌ ఆరోగ్య విస్తరణాధికారి గుల్లెల సింహాద్రి, నడిగట్ట ప్రకాశరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T05:28:41+05:30 IST