రూ.14లక్షల విలువైన వైద్యపరికాల వితరణ

ABN , First Publish Date - 2020-04-11T00:02:23+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తామూ చేయూతనిస్తామని ఇండియన్‌ అకాడ మీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ట్వీన్‌సిటీస్‌ బ్రాంచి ప్రకటించింది. ఈమేరకు 14లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను గాంధీ, నీలోఫర్‌ ఆస్ప

రూ.14లక్షల విలువైన వైద్యపరికాల వితరణ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తామూ చేయూతనిస్తామని ఇండియన్‌ అకాడ మీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ట్వీన్‌సిటీస్‌ బ్రాంచి ప్రకటించింది. ఈమేరకు 14లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను గాంధీ, నీలోఫర్‌ ఆస్పత్రులకు అందజేశారు. ఇందులో 7లక్షల రూపాయల పరికరాలు గాంధీ ఆస్పత్రికి, మరో 7లక్షల రూపాయల విలువైన పరికరాలు నీలోఫర్‌కు అందించారు. ఎన్‌-95 ,పీపీఈ కట్స్‌, ఏరో మిషన్‌లను ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ట్వీన్‌సిటీస్‌ బ్రాంచ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీఎన్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ భాస్కర్‌, ట్రెజరర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు డాక్టర్‌ లాలూ ప్రసాద్‌, డాక్టర్‌ అజయ్‌లు వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. 

Updated Date - 2020-04-11T00:02:23+05:30 IST