రఘురామకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-18T17:01:25+05:30 IST

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

రఘురామకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు

హైదరాబాద్: ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు  కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అధికారులు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. వైద్య బృందం రఘురామకు ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నడవలేక పోవడానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన చెప్పిన సమస్యలపై వైద్యలు పరీక్షలు నిర్వహించనున్నారు. 


రఘురామకు మిలటరీ ఆస్పత్రిలో వీఐపీ స్పెషల్ రూమ్‌లో  వైద్యలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కుడి కాలు తీవ్రమైన వాపు ఉండడంతో నొప్పి తగ్గించడానికి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఇంటర్నల్ పెయిన్స్ పైనే చికిత్స అందిస్తున్నారు. కాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు రిజిస్టర్ నాగార్జునను న్యాయధికారిగా నియమించింది. చికిత్స ప్రక్రియ మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు చెప్పే స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తరువాత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని వైద్యులు తెలిపారు. జ్యూడిషియల్ కష్టడీలో ఉన్న ఎంపీని ఎవరు కలవడానికి వీలులేదు. ఈ నెల 21వ తేదీ వరకు రాఘురామను మిలటరీ ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు చేయనున్నారు. 21 తేదీన ఆయన ఆరోగ్య పరిస్థితి, వీడియో గ్రఫి, స్టేట్‌మెంట్‌ను షీల్డ్ కవర్‌లో పెట్టి న్యాయధికారి సుప్రీం కోర్టుకు అందజేయనున్నారు.

Updated Date - 2021-05-18T17:01:25+05:30 IST