‘మెడికల్‌, డెంటల్‌, అగ్రికల్చర్‌’ ట్యూషన్‌ ఫీజు

ABN , First Publish Date - 2020-02-22T08:52:19+05:30 IST

ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌, ఆయుష్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌, అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తున్న కళాశాలలు 2020-21, 2021-22, 2022-23 బ్లాక్‌ పీరియడ్‌కు

‘మెడికల్‌, డెంటల్‌, అగ్రికల్చర్‌’ ట్యూషన్‌ ఫీజు

ప్రతిపాదనలకు 14 వరకు గడువు పెంపు

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌, ఆయుష్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌, అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తున్న కళాశాలలు 2020-21, 2021-22, 2022-23 బ్లాక్‌ పీరియడ్‌కు ఫీజుల స్థిరీకరణ కోసం ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు మార్చి 14వరకు గడువు పెంచినట్లు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.రాజశేఖరరెడ్డి  తెలిపారు. మెడికల్‌ కాలేజీలు యూజీ, పీజీ , సూపర్‌ స్పెషాలిటీ ప్రోగ్రామ్‌లకు, డెంటల్‌, ఆయుష్‌ కాలేజీలు యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లకు, నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు యూజీ, డిప్లొమా ప్రోగ్రామ్‌లకు నిర్దేశిత 31 షెడ్యూళ్లలో 2017-18, 2018-19 డేటాను తమ ఆడిట్‌ చేసిన ఫైనాన్షియల్‌ సేట్‌ మెంట్లనుhttp://aphermc.ap.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించాలి. 

Updated Date - 2020-02-22T08:52:19+05:30 IST