వైద్య సేవలు మెరుగుకే మెడికల్‌ కాలేజీ

ABN , First Publish Date - 2021-06-17T05:30:00+05:30 IST

గిరిజన ప్రాంతవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్‌ కాలేజీ ఎంతో దోహదపడుతుందని అరకులోయ ఎంపీ గొడ్డేటి. మాధవి అన్నారు.

వైద్య సేవలు మెరుగుకే మెడికల్‌ కాలేజీ
మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తున్న అరకులోయ ఎంపీ జి.మాధవి, పక్కన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి



కాంక్రీట్‌ పనులు ప్రారంభోత్సవంలో అరకులోయ ఎంపీ జి.మాధవి 

పాడేరు, జూన్‌ 17: గిరిజన ప్రాంతవాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్‌ కాలేజీ ఎంతో దోహదపడుతుందని అరకులోయ ఎంపీ గొడ్డేటి. మాధవి అన్నారు. స్థానిక మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో భాగంగా కాంక్రీట్‌ పనులను గురువారం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో కలిసి ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతవాసులకు చక్కని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే సీఎ జగన్మోహనరెడ్డి పాడేరుకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేశారన్నారు. సీఎం జగన్‌కు ఏజెన్సీవాసులంతా కృతజ్ఞతలు తెలపాలన్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తయి వైద్యసేవలు పరంగా గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. మొత్తం 500 కోట్లతో నిర్మించే మెడికల్‌ కాలేజీకి రాష్ట్రం రూ.200 కోట్లు, కేంద్రం రూ.300 కోట్లు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ టి.నరసింగరావు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ శివకుమార్‌ , ఈఈ నాయుడు, నాగార్జున కనస్ట్రక్షన్స్‌ కంపెనీ ప్రధాన మేనేజర్‌ పి.కుమార్‌, తహసీల్దార్‌ వి.ప్రకాశరావు, సీఐ పీపీ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-17T05:30:00+05:30 IST