Advertisement
Advertisement
Abn logo
Advertisement

తానా ఫౌండేషన్, గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కేన్సర్ వైద్య శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో చాగల్లు కాకతీయ కల్యాణ మండపంలో ఉచిత మెగా కేన్సర్ వైద్య శిబిరం శుక్రవారం జరిగింది. సుమారు 410 పైచిలుకు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గ్రామీణుల ఆరోగ్యం కోసం చేస్తున్న కృషి అభినందనీయమని, వారికి తానా తరుపున తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ చాగల్లు నివాసి ప్రవాసాంధ్రుడు విద్యాధర్ గారపాటిని ఆదర్శంగా తీసుకుని గోదావరి జిల్లాల ఎన్నారైలందరూ విద్యావైద్య రంగాల్లో కృషి చేయాలనీ, వారికి రాజకీయాలకి అతీతంగా అందరూ సహకరిస్తామని తెలిపారు. 

మాజీ శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడతూ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కేన్సర్ బాధితులు ఎక్కువగా ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇటువంటి శిబిరాలవల్ల ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి ఎంతో ఉపయోగకరమని, వీటి వాల్ల కేన్సర్ పట్ల అవగాహన కూడా పెరుగుతుందని చెప్పారు.  వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటిస్తూ జీవన విధానంలో మార్పులు చేసుకుని క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలు తమని తాము కాపాడుకోవాలని సూచించారు. తానా ఫౌండషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి మాట్లాడుతూ తాము విదేశాల్లో స్థిరపడినా మనసు ఎప్పుడు పుట్టిన ఊరిమీదే ఉంటుందని తెలిపారు. అందుకే పుట్టిన గ్రామంలో సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

 భవిష్యత్తులో చాగల్లులోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా తానా, గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ సహకారంతో విద్యా, ఆరోగ్య అభివృద్ధికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కేన్సర్ లక్షణాలు ఉన్నవారికి అవసరమైన ఖరీదైన పరీక్షలు గ్రేస్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందచేస్తామని తెలిపారు. షుగర్, ఆర్థోపెడిక్ , బిపి జనరల్ విభాగాలలో అవసరమైన వారికి మందులు అందజేశారు. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఫౌండింగ్ మెంబెర్ డా. చినబాబు సుంకవల్లి ఆధ్వర్యంలో పదిమంది వివిధ రంగాల విద్య నిపుణులు , సుమారు 20 మంది విద్య సిబ్బంది పాల్గొన్నారు. అలాగే స్థానిక పాఠశాల యాజమాన్యం , సుమారు 50  మందికి పైగా ఎన్ సి సి విద్యార్థులు అందించిన సహకారం మరువలేనిదని విద్యాధర్ గారపాటి.. వారికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తానా తరుపున ప్రోత్సాహం అందించిన తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గండ్రోతు సురేంద్ర కుమార్, గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ నిర్వాహకురాలు డా. ప్రమీల రాణి, గారపాటి బ్లెస్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

TAGS: NRI
Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement