రోగులలో దేవుళ్లను చూడండి

ABN , First Publish Date - 2021-02-24T05:54:27+05:30 IST

వైద్యం కోసం వచ్చే పేద రోగుల్లో దేవుళ్లను చూడాలని, వారిని ఆప్యాయంగా పలకరించాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ ఉద్భోధించారు

రోగులలో దేవుళ్లను చూడండి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ప్రమాణం చేస్తున్న వైద్య విద్యార్థులు

 ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వీసీ శ్యామ్‌ ప్రసాద్‌ 

ఘనంగా జీఎంసీ ఫ్రెషర్స్‌ డే


గుంటూరు (మెడికల్‌), ఫిబ్రవరి 23: వైద్యం కోసం వచ్చే పేద రోగుల్లో దేవుళ్లను చూడాలని, వారిని ఆప్యాయంగా పలకరించాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ ఉద్భోధించారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో 2కే20 బ్యాచ్‌ విద్యార్థులకు ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉప్పులూరి- యలవర్తి ప్రధాన ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ శ్యామ్‌ ప్రసాద్‌ హాజరై ప్రసంగించారు. ఇష్టపడి మెడిసిన్‌లో సీటు సాఽధించిన విద్యార్థులు అంతే ఇష్టంతో వైద్య విద్యను సాగించాలని సూచించారు. డాక్టర్‌ బాబులాల్‌ ప్రసంగిస్తూ గుంటూరు వైద్య కళాశాల స్థాపించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ ఏడాది ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఆయన ప్రారంభించారు. వైద్య విద్యార్థులకు యాప్రాన్‌ అందజేశారు.  కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభావతి, జీఎంసీ వైస్‌ ప్రిన్సిపాళ్లు సి.పద్మావతి దేవి, టీటీకే రెడ్డి, జింకానా చీఫ్‌ కోఆర్డినేటర్‌ వి.బాలభాస్కరరావు, కోఆర్డినేటర్‌ పీవీ హనుమంతరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.  

Updated Date - 2021-02-24T05:54:27+05:30 IST