మేడ్చల్: మేడ్చల్ జాతీయ రహదారి కండ్లకోయ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పూల వ్యాపారులు మృతి చెందారు. తూప్రాన్ నుండి గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు కారులో వెళ్తుండగా అతి వేగంతో ముందు వెళ్తున్న మరో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి