ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ‘మేడ్చల్‌’ హవా..

ABN , First Publish Date - 2021-12-17T15:16:05+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా సత్తా చాటింది...

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ‘మేడ్చల్‌’ హవా..

  • 63 శాతం ఉత్తీర్ణతతో గ్రేటర్‌లో ముందంజ
  • రంగారెడ్డిలో 60.. 
  • హైదరాబాద్‌లో 50.01 శాతం మంది పాస్‌

హైదరాబాద్‌ సిటీ : ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా సత్తా చాటింది. గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో అన్నింటికంటే 63 శాతం పర్సంటేజీని నమోదు చేసుకుని విజయదుందుభి మోగించింది. ఆయా జిల్లాల్లో బాలుర కంటే బాలికలు పెద్ద మొత్తంలో ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో తక్కువశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్‌ అధికారులు చెబుతున్నారు. కరోనా సందర్భంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాసులకు ప్రభుత్వ కాలేజీలకు చెందిన విద్యార్థులు చాలామంది హాజరుకాకపోవడంతో పాస్‌ పర్సంటేజీ తగ్గిందని వారు పేర్కొంటున్నారు. కాగా, హైదరాబాద్‌ జిల్లాలో గతేడాది కంటే పది శాతం ఉత్తీర్ణత తగ్గిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-12-17T15:16:05+05:30 IST