మేడారం చిన్న జాతర

ABN , First Publish Date - 2021-02-19T08:31:18+05:30 IST

తెలంగాణలోని మేడారం పేరు వినగానే రెండేళ్ళకు ఒకసారి అంగరంగవైభవంగా జరిగే ‘సమ్మక్క-సారలమ్మ’ జాతర కళ్ళముందు కదులుతుంది. ఆసియాలోనే అతి పెద్ద

మేడారం చిన్న జాతర

తెలంగాణలోని మేడారం పేరు వినగానే రెండేళ్ళకు ఒకసారి అంగరంగవైభవంగా జరిగే ‘సమ్మక్క-సారలమ్మ’ జాతర కళ్ళముందు కదులుతుంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి పొందిన ఈ జాతర సందర్భంగా మేడారం ప్రాంతం జనసముద్రమౌతుంది. ఈ జాతరను నిర్వహించిన మరుసటి ఏడాది చిన్న జాతర జరుగుతుంది. ఈ నెల 24న ప్రారంభమయ్యే ఈ చిన్న జాతరకు మేడారం సిద్ధమవుతోంది.


ఆదివాసీ జాతరగా మొదలై, సకల జనుల వేడుకగా రూపుదిద్దుకున్న మేడారం జాతర శక్తిమంతమైన కాకతీయ సామ్రాజ్యంతో పోరాటాన్ని నడిపి, వీరమరణం పొందిన గిరిజనుల పౌరుషానికి ప్రతీక. రెండేళ్ళకు ఒకసారి మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ జాతరను నిర్వహిస్తారు. కాగా, ప్రధాన జాతర జరిగిన తరువాతి సంవత్సరం చిన్న జాతరను నిర్వహించడం కొన్నేళ్ళ నుంచి ఆనవాయితీగా మారింది. ఈ చిన్న జాతరకు ‘మండమెలిగే పండుగ’తో శ్రీకారం చుడతారు. ప్రధాన జాతర కోసం వనం నుంచి మేడారంలోని గద్దెల మీదకు సమ్మక్క, సారలమ్మ దేవతలు తరలి వస్తారు. చిన్న జాతరలో మాత్రం సమ్మక్క, సారలమ్మల ఆలయాల దగ్గరే పూజలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 27 వరకూ నాలుగు రోజుల పాటు మేడారం చిన్న జాతరను నిర్వహిస్తున్నారు. తొలిరోజైన బుధవారం ఆలయ శుద్ధితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గ్రామాలలోకి దుష్టశక్తులు రాకుండా దిగ్బంధనం చేస్తారు.


ధ్వజ స్తంభాలను ప్రతిష్ఠిస్తారు. అమ్మవార్ల గద్దెలను పూలతో, జాతర జరిగే ప్రాంతాన్ని మామిడి ఆకుల తోరణాలతో అలంకరిస్తారు. రెండవరోజైన గురువారం అమ్మవార్లకు మహిళలు పసుపు, కుంకుమలను అందజేసి, పూజలు చేస్తారు. మూడవరోజైన శుక్రవారం అమ్మవారికి భక్తులు మొధ్వజ స్తంభాలను ప్రతిష్ఠిస్తారు. అమ్మవార్ల గద్దెలను పూలతో, జాతర జరిగే ప్రాంతాన్ని మామిడి ఆకుల తోరణాలతో అలంకరిస్తారు. రెండవరోజైన గురువారం అమ్మవార్లకు మహిళలు పసుపు, కుంకుమలను అందజేసి, పూజలు చేస్తారు. మూడవరోజైన శుక్రవారం అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తమనూ, తమ వారినీ కాపాడాలని వేడుకుంటారు. ప్రధాన జాతర మాదిరిగానే ఈ చిన్న జాతరకు కూడా భక్తులు మూడో రోజున పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. పౌర్ణమి రోజైన శనివారంతో జాతర ముగుస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ గిరిజన ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. 

Updated Date - 2021-02-19T08:31:18+05:30 IST