కిటకిటలాడిన మేడారం

ABN , First Publish Date - 2022-01-21T05:53:42+05:30 IST

కిటకిటలాడిన మేడారం

కిటకిటలాడిన మేడారం
వనదేవతలను దర్శించుకుంటున్న భక్తులు

వనదేవతలకు మొక్కులు 

పెరుగుతున్న భక్తుల రద్దీ

మేడారం, జనవరి 20 : మేడారంలో జాతర సందడి మొదలైంది. పాఠ శాలల సెలవులు ఉండడంతో భక్తులు ముందస్తు మొక్కులకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గురువారం భారీ సంఖ్యలో రావడంతో జంపన్నవాగు నుం చి గద్దెల వరకు జన సందడి నెలకొంది. భక్తులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వనదేవతల గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహంచారు.  రద్దీ బాగా పెరగడంతో గద్దెల వద్దకు వాహనాలను పోలీసులు అనుమించలేదు. కార్లు, బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను హరిత హోటల్‌ వరకే కట్టడి చేస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీనితో భక్తులు అక్కడి నుంచి కాలినడకన వచ్చి తల్లులను దర్శించుకున్నారు. గురువారం ఒక్కరోజే సుమారు 50 వేల మంది మేడారాన్ని సందర్శించారని దేవాదాయ అధికారులు తెలిపారు.


Updated Date - 2022-01-21T05:53:42+05:30 IST