Advertisement
Advertisement
Abn logo
Advertisement

తప్పపని నిరీక్షణ

మరో రెండున్నర నెలల్లో మహాజాతర

 గత జాతరకు రూ.6.10 కోట్లు విడుదల చేసిన కేంద్ర గిరిజన శాఖ

 షెడ్లు, సోలార్‌ లైట్లు,  నీటి శుద్ధీకరణకు వినియోగం 

 తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.75 కోట్లు విడుదల

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై భక్తుల ఆశలు

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

మేడారం మహాజాతర సమీపిస్తోంది. మరో రెండు న్నర నెలల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. తెలం గాణతో పాటు చుట్టూ ఉన్న ఐదారు రాష్ర్టాల నుంచి గిరిజనులు, గిరిజనేతర భక్తులు లక్షలాదిగా ఈ మహాజాతరకు తరలి వస్తారు. అయితే.. గత జాతర కన్నా ఈసారి భక్తులు మరింత భారీ సంఖ్యలో హాజరవుతారని తెలుస్తోంది. కరోనా ఉధృతి తగ్గడంతో మరింత రద్దీ పెరుగొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే జాతరను అత్యంత వైభవంగా నిర్వహిం చాలని ప్రణాళిక రూపొంది స్తున్నారు. దీంతో గతం కంటే ఈసారి జాతరకు వ్యయం భారీగానే పెరగనుందని తెలుస్తోంది. 

గత జాతరలకు కేంద్రం ప్రాధాన్యం

మేడారం మహజాతరను 2018లో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ సమయంలోనే దీనికి జాతీయ హోదా కూడా దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే.. జాతీయ హోదా దక్కకున్నప్ప టికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం జాతర ప్రాముఖ్య తను గుర్తించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈనేప థ్యంలో 2020 ఫిబ్రవరిలో జరిగిన మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుహ్యంగా నిధులు మం జూరయ్యాయి. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి రూ.6.10 కోట్లు కేటాయించారు. ఐటీడీఏ ఏటూరునాగారం ద్వారా ఈ నిధులను ఖర్చు చేశారు.  భక్తుల కోసం మూడు షెడ్లను నిర్మించారు. ఒక్కొక్క షెడ్‌కు రూ. కోటి వెచ్ఛించారు. అలాగే మహాజాతర పరిధి రెడ్డిగూడెం సమీపంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో రెండు షెడ్లు, రెడ్డిగూడెం శివారులో మ రో షెడ్డు నిర్మించారు.  భక్తులు వనదేవతల  దర్శనం అనంతరం బస చేసేలా షెడ్లను సక ల సౌకర్యాలు ఏర్పాటు చేఽశారు. అలాగే మేడారం జాతరలో రూ.85 లక్షలతో మురికినీటి శుద్ధీకరణ  ప్లాంట్లను ఏర్పాటు చేశారు.  రూ. 35 లక్షలతో 25 వేల కిలో లీటర్ల సామర్థ్యం గల రెండు ప్లాంట్లు, రూ.15 లక్షలతో 10 కిలోలీటర్ల సామర్థ్యంతో మరో ప్లాం టును నిర్మించారు. అలాగే మేడారం పరిసరాల గ్రామా ల్లో సోలార్‌ వెలుగుల కోసం కేం ద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిం ది. రూ.2.25 కోట్లలతో మేడారంతో పాటు పరిసర 13 గ్రామాల్లో 229 సోలార్‌ లైట్ల ఏర్పాటు చేఽశారు. మేడారంతో పాటు నార్లాపూర్‌, ఊరట్టం, కన్నెపల్లి, పగిడపూర్‌, చిలకలగుట్ట, కొత్తూరు, కాల్వపల్లి, ఎలుబాక, ప్రాజెక్ట్‌నగర్‌, ఉప్పాలగడ్డ, మెట్లగూడెం, గోనెపల్లి తదితర గ్రామాల్లో సోలార్‌  లైట్లకు కేంద్రం నిధులను గిరిజన సంక్షేమ శాఖ వెచ్ఛించింది. దీంతో గత మహాజాతరకు కేంద్రం తన వాటా ద్వారా అభివృద్ధిలో కొంత వరకు భాగస్వామ్యం కావటం పట్ల భక్తుల్లో ఆనందం వ్యక్తమైంది.

నిఽధుల కేటాయింపుపై స్పష్టత కరువు

జాతరకు మరో రెండున్నర నెలల సమయమే మిగి లి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు సౌక ర్యాలు కల్పించేందుకు రూ.75కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. అయితే.. గత మహాజాతరలా కేంద్ర ప్రభుత్వం ఈ సారి కూడా భారీగానే కేటాయిస్తుందనే ఆశతో భక్తు లు ఉన్నారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖతో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తన కోటా నుంచి కూడా మేడారం జాతరకు నిధులు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి రూ.25 కోట్ల నిధులతో మేడారం జాతరలో కేంద్ర అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  జాతర ప్రాంతంలో శాశ్వత రోడ్లతో పాటు తాగునీటి సౌకర్యం, సెంట్రల్‌ లైటింగ్‌, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిఽధులు కేటాయించేలా ఇప్పటికే ప్రతి పాదనలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వెళ్లినట్టు సమా చారం. అలాగే మేడారం మహాజాతరకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి పర్యాటకంగా కూడా అభి వృద్ధి చేసేందుకు కూడా ప్రణాళిక తయారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. కేంద్రం నుంచి వచ్చే నిఽధులపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం భక్తుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై  తమకు కూడా స్పష్టత లేదని ఏటూరునాగారం ఐటీడీఏ ఇంజనీరింగ్‌ అధికా రులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మేడారం భక్తులు కిషన్‌రెడ్డిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పార్ల మెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆయన కేం ద్రం నుంచి  నిధులు విడుదల చేయిస్తారని ఆశాభా వం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నిధులతోపాటు కేం ద్రం నుంచి కూడా భారీగా నిధులు వస్తే మేడారం మహాజాతరకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు లభ్యమ వుతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల హైద రాబాద్‌లో జరిగిన గిరిజన దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మేడారం మహాజాతరకు కేంద్రం నిధులు ఇస్తుందని ప్రకటించారు. ఆ హమీ మేరకు ఆయన చొరవతీసుకొని మేడారం  అభివృద్ధికి నిధులతోపాటు జాతరకు జాతీయ హోదా దక్కిం చుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement