మెదక్‌ జిల్లాలో కల్లు ప్రియుల ఆందోళన

ABN , First Publish Date - 2020-03-29T11:14:28+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు ‘కల్లు’ కష్టాలు వచ్చాయి. లాక్‌డౌన్‌ కారణంగా మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కూచారం గ్రామంలో

మెదక్‌ జిల్లాలో కల్లు ప్రియుల ఆందోళన

నిజామాబాద్‌లో కల్లు దొరక్క ఇద్దరి మృతి

మనోహరాబాద్‌/నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 28: లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు ‘కల్లు’ కష్టాలు వచ్చాయి. లాక్‌డౌన్‌ కారణంగా మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కూచారం గ్రామంలో కల్లు దుకాణాలు మూసేశారు. దీంతో విక్రయదారులు రెండు రోజులుగా గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద విక్రయించారు. పోలీసుల హెచ్చరికతో శనివారం కల్లు విక్రయాలు జరగలేదు. దీంతో కల్లు లేకుండా ఉండలేమని, తమకు తక్షణం విక్రయించాలంటూ కల్లు ప్రియులు కల్లు దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎస్‌ఐ పద్మారావు, పోలీసులు రావడంతో ఆందోళనకారులు పరారయ్యారు. మరోవైపు నిజామాబాద్‌ నగరంలో కల్లు దొరక్క శనివారం ఇద్దరు మృతి చెందారు.


శకుంతల(60) అనే మహిళ ఫినాయిల్‌ తాగి ఆత్మహత్య చేసుకోగా.. భోనగిరి భూషణ్‌(44) కల్లు లేక ఫిట్స్‌ వచ్చి మృతి చెందాడు. రోజూ కల్లు తాగే అలవాటున్న శకుంతలకు లాక్‌డౌన్‌ అశనిపాతంలా మారింది. కల్లు విరహాన్ని తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున బాత్‌రూంలోకి వెళ్లి ఫినాయిల్‌ తాగింది. తన భార్య కల్లు దొరక్క మృతి చెందిందని శకుంతల భర్త సత్తయ్య పేర్కొనడంతో కేసు నమోదుపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

Updated Date - 2020-03-29T11:14:28+05:30 IST