మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-11T16:11:31+05:30 IST

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఉమ్మడి మెదక్ జిల్లా

మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం

మెదక్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో మెదక్, సంగారెడ్డి జిల్లా తడిసి ముద్దయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో సగటున 7.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నిజాంపేట మండలంలో 15.4 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. నారాయణఖేడ్ మండలంలో కూడా కుండపోత వర్షం కురిసింది. నారాయణఖేడ్‎లో మొత్తం 13.6 సెంటిమీటర్ల వర్షంపాతం నమోదైంది.

Updated Date - 2021-06-11T16:11:31+05:30 IST