Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 13 Aug 2022 16:21:06 IST

Mechanic: ట్రబుల్ షూటర్ షూట్ మొదలెట్టాడు

twitter-iconwatsapp-iconfb-icon

టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్. నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మెకానిక్’ (Mechanic). ‘ట్రబుల్ షూటర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ముని సహేకర (Muni Sahekara) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్‌ను తాజాగా ప్రారంభించారు. మణిసాయితేజ (Mani Saiteja) టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రేఖనిరోషా (Rekha Nirosha) అతని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 


షూటింగ్ మొదలైన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే.. ప్రస్తుత సమాజంలో ఉన్న ఓ బర్నింగ్ ప్రాబ్లమ్‌ని ఈ చిత్రంలో చూపిస్తున్నాము. సినిమాకి కావాల్సిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. ఎన్.వి. శివరాం కెమెరా, వినోద్ యాజమాన్య సంగీతం, చంద్రబోస్, ఎమ్.ఎన్. సింహ పాటలు,  థ్రిల్లర్ మంజు ఫైట్స్, ఎమ్.ఆర్. వర్మ ఎడిటింగ్, శ్రీజాయ్ శ్రీను ఆర్ట్.. ఇలా అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. దర్శకుడు ముని సహేకర ఈ చిత్రంతో ఒక గొప్ప విషయాన్ని సమాజానికి చెప్పబోతున్నారు. షూటింగ్‌ని ఏకధాటిగా జరిపేందుకు ప్లాన్ చేశాం. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తాం..’’ అని తెలిపారు. (Mechanic Movie Shooting Update)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement