Abn logo
Oct 18 2021 @ 23:41PM

ఏఎంసీల బలోపేతానికి చర్యలు

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

పలాస, అక్టోబరు 18:  ఏఎంసీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని మంత్రి  సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం  పద్మనాభపురం మార్కెట్‌ యార్డులో చైర్మన్‌ పీవీ సతీష్‌ అధ్యక్షతన  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మేలు చేసేలా కార్యక్రమాలు రూ పొందిస్తామన్నారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పన, గోదా ములు, కోల్డ్‌ స్టోరేజీ, హైవేపై క్యాజూ బజారు  నిర్మాణం, తక్కు వ వడ్డీకి రుణాలు, రైతుబజారు, జీడి పరిశోధన కేంద్రం ఏర్పా టు, పలాస జీడి పప్పు టీటీడీ కొనుగోలు చేయడంపై తీర్మానిం చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు మల్లా సురేష్‌ కుమార్‌, మల్లా రామేశ్వరరావు, ఏఎంసీ  కార్యదర్శి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.