అధిక ధరకు వంటనూనెను విక్రయిస్తే చర్యలు: మంత్రి కారుమూరి

ABN , First Publish Date - 2022-04-26T23:47:51+05:30 IST

వంటనూనె ధరల నియంత్రణపై పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులతో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

అధిక ధరకు వంటనూనెను విక్రయిస్తే చర్యలు: మంత్రి కారుమూరి

అమరావతి: వంటనూనె ధరల నియంత్రణపై పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులతో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు వంటనూనెను విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నూనె నిల్వలపై ఏపీవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని విజెలెన్స్ అండ్ ఎన్ ఫోర్సమెంట్ అధికారులతో మంత్రి అన్నారు. మండలాల వారీగా రిపోర్ట్స్ తీసుకొని రేట్లను పరిశీలించాలని చెప్పారు. అనధికార నిల్వలు, కృతిమ కొరత సృష్టిస్తే బైండ్ ఓవర్ కేసులు నమోదు‌ చేయాలన్నారు.  పౌరసరఫరాల శాఖ ద్వారా సామన్య ప్రజలకు అండగా ఉండాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సూచించారు.  

Updated Date - 2022-04-26T23:47:51+05:30 IST