Abn logo
Sep 26 2021 @ 00:50AM

అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి చర్యలు

నక్కపల్లి కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న చిన్మయాదేవి


 ఆర్‌జేడీ చిన్మయాదేవి

నక్కపల్లి, సెప్టెంబరు 25 : ఐసీడీఎస్‌ రీజియన్‌ పరిధిలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేప డుతున్నట్టు ఆర్‌జేడీ చిన్మయాదేవి తెలిపారు.  నక్కపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై శనివారం ఇక్కడ ఆమె సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీజియన్‌ పరిధిలో 60 సీడీపీవో ప్రాజెక్ట్‌లు ఉండగా, 209 అంగన్‌వాడీ వర్కర్లు, 156 మినీ వర్కర్లు, 657 సహాయకుల పోస్టుల భర్తీ చేస్తున్నామని చెప్పారు. రీజియన్‌ పరిధిలో 12,873 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, 3,940 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయ న్నారు 6,135 అద్దె భవనాల్లో కొన సాగుతున్నట్టు చెప్పారు. జిల్లాలో అసం పూర్తి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ 3.18కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ఆమె వివరించారు. వీటితో త్వరితగతిన పనులు పూర్తి చేయ నున్నామన్నారు.