33,138 ఎకరాలకు హక్కులు కల్పించేందుకు చర్యలు

ABN , First Publish Date - 2020-07-12T09:33:09+05:30 IST

అటవీ హక్కుల చట్టంలో భాగంగా ఈ ఏడాది 33,138 ఎకరాల అటవీ సాగు భూములకు హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఐటీడీఏ పీవో

33,138 ఎకరాలకు హక్కులు కల్పించేందుకు చర్యలు

టీడబ్ల్యూ ముఖ్యకార్యదర్శి వీడియో కాన్ఫరెన్సులో పీవో 


పాడేరు, జూలై 11: అటవీ హక్కుల చట్టంలో భాగంగా ఈ ఏడాది 33,138 ఎకరాల అటవీ సాగు భూములకు హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే అటవీ హక్కుల చట్టంపై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీవో పాల్గొన్నారు.


అర్హులైన వారందరికీ అటవీ హక్కులు కల్పించాలని, ఎంతమందికి హక్కులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారని పీవోను ముఖ్యకార్యదర్శి అడిగారు. ఏజెన్సీ వ్యాప్తంగా 13,471 మంది ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా 33,138 ఎకరాల్లోని అటవీ సాగు భూములకు హక్కులు కల్పిస్తామని పీవో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి డివిజన్‌, జిల్లా స్థాయిల్లోనూ ఆమోదం పొందామన్నారు.

Updated Date - 2020-07-12T09:33:09+05:30 IST