Abn logo
Feb 22 2020 @ 02:26AM

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఫిబ్రవరి నెల దాటకుండానే భానుడి ఉగ్రరూపంతో ఎండలు మండుతున్నాయి. నదులు, కాలువలలో నీటిమట్టం పడిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి‌. తెలుగు రాష్ట్రాల్లో అవసరమైన ప్రాంతాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సాగునీరు లేక పంట భూములు, గొంతు తడవక పశువులు అల్లల్లాడుతున్నాయి. అయితే, నీటి ఎద్దడి నివారణా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నదుల్లో, కాలువల్లోనూ సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పరివాహక ప్రాంతాల్లో చెరువుల్లో పూడికతీత, బావులు, ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టినట్లయితే భూగర్భ జలాలు పెరగగలవు. ట్యాంకర్ల సరఫరాకి వెచ్చించే ధనాన్ని బావులు చెరువులు మరమ్మత్తులకు వినియోగించినట్లయితే నీటి ఎద్దడి నివారించడంతో పాటు మానవ, పశు సంతతితో పాటు భూమాత కు శాశ్వత నీటి పరిష్కారం లభిస్తుంది.

వై. ధర్మరాజు

Advertisement
Advertisement