ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు: ఏయూ వీసీ

ABN , First Publish Date - 2022-05-27T22:02:14+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తుప్పులను, చెట్లును దాతల సహాకారంతో శుభ్రం చేస్తున్నామని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు: ఏయూ వీసీ

విశాఖపట్నం:  ‘నాడు-నేడు’లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా  ఇంజనీరింగ్ క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తుప్పలను, చెట్లను దాతల సహాకారంతో శుభ్రం చేస్తున్నామని చెప్పారు.  ఆ పరిసరాలను శుభ్రం చేస్తుడడంతో కండోమ్స్ , మద్యం సీసాలు బయటపడ్డాయని వీటితో  విద్యార్థులకు సంబంధం లేదని చెప్పారు.  ఇంజనీరింగ్ క్యాంపస్‌లో ఏపుగా పెరిగిన చెట్ల ప్రాంతం హిజ్రాలకు నివాసంగా మారిందన్నారు. పలుమార్లు ఈ విషయంపై విద్యార్థులు యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేశారన్నారు.హిజ్రాలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని వాడుకుంటున్నారన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద సెక్యూరిటి వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు.అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-05-27T22:02:14+05:30 IST