సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు

ABN , First Publish Date - 2022-07-07T06:59:44+05:30 IST

వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో సీజ నల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్లాని జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మం దిరంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, పారిశుధ్ద్యం, హరితహరం, గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనుల పురోగతి వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
అవార్డులను ప్రదానం చేస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఆదేశం

ఆదిలాబాద్‌ టౌన్‌, జూలై 6: వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో సీజ నల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్లాని జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మం దిరంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, పారిశుధ్ద్యం, హరితహరం, గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనుల పురోగతి వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాఽధులు వ్యాప్తి చెం దకుండా నియంత్రణకు  పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ గ్రామాలు, హైరిస్క్‌ ప్రాంతాలలో డెంగ్యూ కేసులు నమో దయ్యాయని తెలిపారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఆశా, ఏఎన్‌ఎం, వైద్య, అంగన్వాడీ సిబ్బంది నిరంతరం పారిశుధ్ద్య కార్యక్రమాలను పర్యవేక్షించాల ని సూచించారు. నీటి ట్యాంకులను నెలలో నాలుగుసార్లు శుభ్ర పర్చాల న్నారు. వ్యాదుల నియంత్రణ, పరిసరాల శుభ్రతపై గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అవగాహన కల్పించలని పలు సూచనలు చేశారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా, డీఆర్డీవో కిషన్‌, డీపీవో శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో గణపతి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, తదితరులు పాల్గొన్నారు.

33  పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం

ఆదిలాబాద్‌ టౌన్‌: స్వచ్చ విద్యాలయ పురస్కార్‌ అవార్డులకు పాఠశాలలు ఎంపిక కావడం అభినందనీయమని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. బుధ వారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కారం అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛ విద్యా లయ పురస్కారాల అవార్డుకు 33 పాఠశాలలు ఎంపిక కావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌, ఆర్డీఓ రాథోడ్‌రమేష్‌, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణిత, సెక్టోరల్‌ అధికారి సుజాత్‌ఖాన్‌, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తలమడుగు: మండలంలోని పల్సి(కే) పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ 2021 సంవత్సరానికి ఉత్తమ పాఠశాల పురస్కారంగా ఎంపికైంది. దీనిని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అదనపు కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ భాషా చేతుల మీదుగా అవార్డు అదించడం జరిగింది.  

Updated Date - 2022-07-07T06:59:44+05:30 IST